ప్రశాంత్ వర్మ కామెంట్స్ కి తేజ సజ్జ లవ్లీ రిప్లై!


టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన హను మాన్ (Hanu man) మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే రిజల్ట్ ను కంటిన్యూ చేసేందుకు తేజ సజ్జ మిరాయ్ (Mirai) అనే భారీ బడ్జెట్ మూవీ తో మన ముందుకు రానున్నారు. ఈ చిత్రం కి సంబందించిన గ్లింప్స్ ను నిన్న రిలీజ్ చేయగా, ఆడియెన్స్ నుండి సెన్సేషన్ రెస్పాన్స్ వస్తోంది.

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రం గ్లింప్స్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. సూపర్ హీరో నుండి సూపర్ యోధ వరకూ అంటూ చెప్పుకొచ్చారు. దీనిపై హీరో తేజ సజ్జ రెస్పాండ్ అయ్యారు. లవ్ సింబల్ పెట్టి తన అభిప్రాయం వెల్లడించారు. మరొక పక్క ప్రశాంత్ వర్మ వచ్చే ఏడాది జై హను మాన్ మూవీ తో ఆడియెన్స్ ను అలరించడానికి రెడీ అవుతున్నారు.

Exit mobile version