మరో మలయాళం రీమేక్.. యువ హీరో చేతికి ప్రాజెక్ట్

Published on Oct 23, 2020 12:09 am IST


ఈమధ్య మన తెలుగు సినిమాలు హిందీ ప్రేక్షకుల్ని, దర్శక నిర్మాతలను ఆకట్టుకుంటుంటే మన తెలుగు నిర్మాతలను మలయాళ సినిమాలు బాగా ఆకర్షిస్తున్నాయి. అందుకే అక్కడ హిట్టైన కొన్ని సినిమాలను ఇప్పటికే రీమేక్ చేసే పనులు మొదలయ్యాయి. తాజాగా మరొక మలయాళ చిత్రాన్ని కూడ తెలుగులోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. అదే ‘ఇష్క్’. ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ రీమేక్ చేయనున్నారు.

ఇందులో హీరోగా తేజ సజ్జ నటించనున్నాడు. చైల్డ్ ఆర్టిస్టుగా అందరికీ పరిచయమున్న తేజ సజ్జ ఇటీవలే ‘ఓ.. బేబీ’ చిత్రంతో పూర్తి స్థాయి నటుడిగా వెండితెర మీదకి వచ్చాడు. ఇప్పుడు హీరోగా పరిచయం కానున్నాడు. మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న లవ్ థ్రిల్లర్ ‘ఇష్క్’ ను తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా కొన్ని మార్పులు చేసి అందించనున్నారు. మరి ఈ రీమేక్ చిత్రానికి డైరెక్ట్ చేయబోయే నటుడు ఎవరనేది ఇంకా అనౌన్స్ కావలసి ఉంది.

సంబంధిత సమాచారం :

More