తెలంగాణలో ‘గేమ్ ఛేంజర్’ టికెట్ రేట్లు పెంపు.. ఎక్స్‌ట్రా షో కూడా..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ ఎల్లుండి(జనవరి 10) రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీ టికెట్ రేట్లు ఎలా ఉండబోతున్నాయా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే, ఏపీలో ఇప్పటికే ఈ సినిమా టికెట్ రేట్ల పెంపుకు అక్కడి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ, ‘పుష్ప 2’ సంధ్య థియేటర్ ఘటన తర్వాత తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు ఉండబోదని రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటికే ప్రకటించింది.

ఈ విషయంపై తెలంగాణ సీఎంను ‘గేమ్ ఛేంజర్’ టీమ్ రిక్వెస్ట్ చేయడంతో నైజాం ప్రాంతంలో ఈ చిత్ర టికెట్ రేట్లు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్ షోలకు మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ నో చెప్పింది. ఇక రిలీజ్ రోజున ఉదయం 4 గంటలకు ఎక్స్‌ట్రా షో వేసుకునేందుకు అనుమతినిచ్చింది. రిలీజ్ రోజున ఈ చిత్ర టికెట్ రేట్లను మల్టీప్లెక్స్‌లో రూ.150, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100 మేర పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది.

ఇక జనవరి 11 నుంచి 5 షోలు వేసుకునేందుకు.. మల్టీప్లెక్స్‌లో రూ.100, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50 మేర టికెట్ రేట్ల పెంపుకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తాజాగా జీఓను కూడా జారీ చేసింది. దీంతో నైజాం ప్రాంతంలో ఇక ఈ చిత్ర టికెట్ బుకింగ్స్ తెరుచుకోనున్నాయి.

Exit mobile version