“పుష్ప” నుంచి నాకు మంచి గుర్తింపు వచ్చింది – నటి అక్షర

“పుష్ప” నుంచి నాకు మంచి గుర్తింపు వచ్చింది – నటి అక్షర

Published on Sep 10, 2022 3:02 PM IST

మన తెలుగు సినిమాలో తెలుగు హీరోయిన్స్ కాస్త తక్కువ మందే కనిపించొచ్చు కానీ తెలుగు ఆర్టిస్టులు మాత్రం తక్కువ కాదని చెప్పాలి. అలా మన తెలుగమ్మాయి అక్షర నటన పట్ల ఆసక్తితో సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. మొదటగా కళ్యాణ్ రామ్ ‘ఎంత మంచివడవురా’ సినిమాతో పెళ్లి కూతురు పాత్రలో నటించింది. ఆ తరువాత రామ్ రెడ్ మూవీలో ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్తె రోలో లో మెప్పించింది.

అయితే ఈ చిత్రం తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ పుష్ప సినిమాలో హీరో వదిన పాత్రలో తాను కనిపించి మెప్పించింది. అక్కడ నుంచి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే పుష్ప పార్ట్ 2 లో కూడా అక్షర పాత్ర కొనసాగుతుంది. ఇంకా మాస్ మహారాజ రవితేజ సుధీర్ వర్మ కాంబినేషన్ లో వస్తోన్న “రావణాసుర” ఒక విభిన్న రోల్ లో నటిస్తోంది.

టాలెంటెడ్ ఉంటే తెలుగు పరిశ్రమలో అవకాశాలు ఎప్పుడూ తలుపు తడుతూనే ఉంటాయి అంటుంది అక్షర. నటనకు ప్రాధాన్యం ఉన్న మరిన్ని మంచి రోల్స్ చేయాలనేది అక్షర లక్ష్యం. తనలోని ట్యాలెంట్ చూసి ఆడిషన్స్ చేసి తనకు అవకాశాలు ఇస్తున్న దర్శక నిర్మాతలకు ఈ సందర్భంగా ఈ టాలెంటెడ్ తెలుగు యువ నటి ధన్యవాదాలు తెలియజేస్తుంది. మరి ఆమె మరిన్ని చిత్రాల్లో కనిపించి అలరించాలని మా యూనిట్ కూడా ఆకాంక్షిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు