“బిగ్ బాస్ 4″కు బ్రేక్ పడనుందా.?

Published on Aug 13, 2020 12:14 am IST


మన తెలుగు స్మాల్ స్క్రీన్ పై బిగ్గెస్ట్ ఎవర్ రియాలిటీ గేమ్ షో ఏదన్నా ఉంది అంటే అది “బిగ్ బాస్” షో అని చెప్పాలి. విజయవంతంగా ఇప్పటి వరకు మొత్తం మూడు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ గ్రాండ్ రియాలిటీ షో కు కొనసాగింపుగా నాలుగో సీజన్ కూడా ఉన్నట్టు ఇటీవలే అధికారికంగా కన్ఫర్మ్ అయ్యింది. ఈసారి కూడా హోస్ట్ గా కింగ్ నాగార్జునే మళ్ళీ హోస్టింగ్ చెయ్యడానికి సిద్ధం అయ్యారు.

ఇక ఈ ఆగష్టు నెలాఖరున మొదలు కావడానికి అంతా రంగం సిద్ధం అవుతుంది అనుకునే లోపల బ్రేక్ పడనున్నట్టుగా సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కంటెస్టెంట్స్ విషయంలోకి వస్తే చివరి నిమిషంలో మొత్తం అందరూ సెట్ కాలేదని తెలుస్తుంది. అందుకే ఈ సారి సీజన్ మరికొంత ఆలస్యం అవ్వనుంది అని టాక్. మొత్తం 90 రోజులకు ప్లాన్ చేసిన ఈ షోలో ఈసారి కంటెస్టెంట్స్ గా ఎవరు కనిపిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :

More