బిగ్ బాస్ : అభిజీత్, అఖిల్ మధ్య మళ్లీ గొడవ !

Published on Nov 28, 2020 11:51 pm IST

బిగ్ బాస్ ఈ సీజన్ మొదలైన దగ్గర నుండే అభిజీత్, అఖిల్ మధ్య విభేదాలు మొదలైయ్యాయి. ఇప్పటికే వీళ్లిద్దరి మధ్య చాలా సార్లు మాటా మాటా పెరిగి గొడవలు జరిగాయి. అలాగే ఈ రోజు కూడా వీళ్లిద్దరి మధ్య వంట గది దగ్గర మరోసారి వాదన జరిగింది. గత వారం లాస్య ఎలిమినేట్ అవుతూ అభిజీత్‌ పై బిగ్ బాంబ్ వేయడం, దాని ప్రకారం ఈవారం వంట అభిజీత్ చేయాల్సి వచ్చింది. అయితే వంట గదిలోకి దోసెలు వేస్తానంటూ అఖిల్ వచ్చి.. దోసె పండిని బౌల్‌లో వేసి తిప్పుతూ ఉండగా.. అది అభిజీత్ కి నచ్చలేదు.

ఇక అక్కడి నుంచి అభిజిత్ మొదలుపెట్టాడు. కిచెన్‌లోకి రావాలంటే అడగాలి అంటే.. అఖిల్ ఆ.. ఎవరిని అడగాలి అంటూ ప్రశ్నించడం.. ఇక ఇక్కడ నుండి వీరి వాదన పెరుగుతూ పోయింది. అలా అభిజీత్, అఖిల్ మధ్య మాటల యుద్ధం దెబ్బకు అఖిల్ కిచెన్ నుంచి కోపంగా వెళ్తూ డైనింగ్ టేబుల్ వద్ద చైర్లను తన్నుకుంటూ వెళ్లడంతోటి అర్ధం చేసుకోవచ్చు వీరి మధ్య ఏ స్థాయి గోడవుల ఉన్నాయో. ఈ తతంగం అయ్యాక బ్రాండ్ల ప్రమోషన్‌లో భాగంగా బిగ్ బాస్ ఇంటి సభ్యులకు రెండు మూడు టాస్క్‌లు ఇచ్చారు. ఇదంతా ప్రేక్షకులకు చూపించిన హోస్ట్ నాగార్జున.. తరవాత మన టీవీ ద్వారా ఇంటి సభ్యులతో మాట్లాడారు. ఈవారం ఎవరు ఎలిమినేట్ అయ్యేది రేపు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :

More