హత్య కేసులో తెలుగు డైరెక్టర్ అరెస్ట్

హత్య కేసులో తెలుగు డైరెక్టర్ అరెస్ట్

Published on Nov 2, 2011 10:34 AM IST

అసిస్టెంట్ డైరెక్టర్ సత్యవతి హత్యకు గురైంది. నేరారోపణపై తెలుగు చలన చిత్ర దర్శకుడు రాజేంద్ర ప్రసాద్ ను బంజారా హిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సత్యవతి హత్యకు సంబంధించి అతన్ని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలు కృష్ణా నగర్ లో నివాస ముంటుంది. సంఘటన జరిగిన అనంతరం బాధితురాలిని శ్రీనగర్ కాలనీ లోని తన్వీర్ హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే సత్యవతి మరణించినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

దర్శకుడు రాజేంద్ర ప్రసాద్ ప్రస్తుతం ‘థ్రిల్లర్’ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అంతకుముందు ‘ప్రతిక్షణం’ అనే సినిమాకు ఆయన పనిచేసారు. కాగా, సత్యవతి మెడ చుట్టూ గాయాలు, గోరు గాట్లు ఉన్నాయి. సత్యవతి మేడపై ఉన్న వెలి ముద్రలు, రాజేంద్రప్రసాద్ వెలి ముద్రలతో సరిపోవటంతో పోలీసులు రాజేంద్ర ప్రసాద్ ను అనుమానిస్తున్నారు.

ఇదిలావుంటే, రాజేంద్ర ప్రసాద్ – సత్యవతి ల మధ్య గత మూడేళ్ళుగా వివాహేతర సంబంధం నడుస్తున్నట్టు సమాచారం. ఆయనకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు