రజినీ సినిమా పట్ల తెలుగు ఆడియెన్స్ అసహనం.. కారణమిదే.!


కోలీవుడ్ తలైవర్, సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు టిజె జ్ఞానవేల్ తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ పోలీస్ యాక్షన్ చిత్రం “వేట్టయన్” కోసం తెలిసిందే. మరి ఈ చిత్రంలో విలక్షణ నటులు రానా దగ్గుబాటి అలాగే ఫహద్ ఫాజిల్ బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ లు కూడా ఉన్నారు.

అయితే తమిళ్ సహా తెలుగు, హిందీ మరియు కన్నడ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కి వస్తుండగా ఈ సినిమా తెలుగు రిలీజ్ విషయంలో మాత్రం తెలుగు ఆడియెన్స్ కొంచెం డిజప్పాయింట్ గా ఉన్నారు. ఈ మధ్య కాలంలో వస్తున్న తమిళ సినిమాలు దాదాపు తమిళ్ లో పెట్టిన టైటిల్ నే తెలుగు అనువాదం లేకుండా తెలుగు ఆడియెన్స్ లో తమిళ్ టైటిల్స్ ని రుద్దుతున్నారు అని టాక్ సోషల్ మీడియాలో ఇప్పుడు ఊపందుకుంది.

దీనితో తెలుగు ఆడియెన్స్ మాత్రం కొంతమేర వేట్టయన్ కి దూరంగానే ఉంటామని అంటున్నారు. అయితే ఇదే తెలుగు నుంచి తమిళ్ లేదా కన్నడ భాషల్లో మార్చగలిగే వీలున్న సినిమాలకి కూడా మార్చకుండా రిలీజ్ చేస్తే వారు అడిగిన సందర్భాలు లేవా? తెలుగు ఆడియెన్స్ ని ఇంత గ్రాంటెడ్ గా ఎందుకు తీసుకుంటున్నారు అంటూ టాలీవుడ్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version