సాధారణంగా పరభాషా నిర్మాతలు టాలీవుడ్ లో నెగ్గుకొచ్చిన ధాఖలాలు ఎక్కువ వున్నాయి గానీ ఇక్కడి వారు అక్కడ జెండా ఎగరేసిన సందర్భాలు తక్కువే. అయితే టాలీవుడ్ లో వరుసపెట్టి పెద్ద సినిమాలను నిర్మిస్తూ ఆనతికాలంలోనే పాపులర్ అయిన 14రీల్స్ సంస్థ అధినేతలలో ఒకరైన అనీల్ సుంకర మాత్రం ఇక్కడే కాక అక్కడ కూడా తన భారీతనాన్ని రుజువుచేస్తున్నాడు
అనీల్ సుంకర కన్నడలో నిర్మించిన పవర్ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమా తెలుగు దూకుడుకి అఫీషియల్ రీమేక్. పునీత్ రాజ్ కుమార్, త్రిషలు జంటగా నటించిన ఈ చితం ఇటీవలే 100రోజుల వేడుకను జరుపుకుంది. అయితే ఈ శతదినోత్సవ వేడుకలను అనీల్ నిర్వహించిన తీరు కన్నడ చిత్ర వర్గాల బడా స్టార్లకు సైతం ఆశ్చర్యం కలిగించిందట. తన భారీతనాన్ని మరోసారి రుజువు చేసి అక్కడ కూడా పాగా వేయడానికి అనీల్ కష్టపడుతున్నట్టు సమాచారం


