ప్రముఖ సినీనటుడు రావి కొండల రావు ఇకలేరు..!


టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు రావి కొండల రావు కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా బేగంపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన కొద్ది సేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు.

అయితే శ్రీకాకుళం జిల్లాలో జన్మించిన రావి కొండలరావు సినీ రచయితగా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆరు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 600కి పైగా సినిమాలో నటించి ప్రేక్షకుల మదిలో తనకంటూ చెరిగిపోని ముద్ర వేసుకున్నాడు. రాముడు భీముడు, తేనె మనసులు, అలీబాబా 40 దొంగలు, పెళ్ళి పుస్తకం, భైరవ దీపం, మీ శ్రేయోభిలాషి, కింగ్, వరుడు వంటి అనేక సినిమాలో రావి నటించాడు. ఏదేమైనా టాలీవుడ్ మరో సీనియర్ నటుడిని కోల్పోయింది.

Exit mobile version