పవన్ తో “వీరమల్లు” మేకర్స్ కి టెన్షన్!

పవన్ తో “వీరమల్లు” మేకర్స్ కి టెన్షన్!

Published on Feb 2, 2025 1:00 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు జ్యోతి కృష్ణ అలాగే క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. ఎప్పుడో నాలుగేళ్ళ కితం మొదలైన ఈ సినిమా ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఈ సినిమా తోనే బ్రో, భీమ్లా నాయక్, వకీల్ సాబ్ లాంటి సినిమాలు కంప్లీట్ చేసిన పవన్ వీరమల్లుని మాత్రం పూర్తి చేయలేకపోతున్నారు.

దీనితో ఇపుడు మేకర్స్ లో మరింత టెన్షన్ మొదలైనట్టు తెలుస్తుంది. ఇంకోపక్క రిలీజ్ డేట్ కి సమయం కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో పవన్ ఇంకా నాలుగు రోజులు అలా డేట్స్ ఇవ్వాల్సి ఉందట. ఈ డేట్స్ ఒకటి ఇచ్చేస్తే తన పోర్షన్ మొత్తం పూర్తి అయ్యిపోయినట్టే అని తెలుస్తుంది. కానీ ఈ డేట్స్ పవన్ ఇచ్చేది ఎపుడు అని మేకర్స్ టెన్షన్ లేకపోలేదట. అవి ఇస్తేనే ఆన్ టైం రిలీజ్ కి సినిమాని తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది లేకపోతే మళ్ళీ సినిమా వాయిదా తప్పదని చెప్పక తప్పదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు