రీసెంట్ గా కోలీవుడ్ సినిమా దగ్గర రిలీజ్ కి వచ్చి సూపర్ హిట్ అయ్యిన చిత్రాల్లో క్రేజీ హారర్ థ్రిల్లర్ “డిమొంటి కాలనీ 2” కూడా ఒకటి. దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించిన ఈ చిత్రంలో అరుల్ నితి, ప్రియ భవాని శంకర్ లు మెయిన్ లీడ్ లో నటించారు. మరి వీరి కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం తెలుగులో కూడా డీసెంట్ వసూళ్లు అందుకుంది.
ఇక ఈ చిత్రం ఇపుడు ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయినట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ చిత్రం ఈ సెప్టెంబర్ 20 నుంచి ఓటీటీ వీక్షకులను అలరించేందుకు రాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా హక్కులు జీ 5 సంస్థ తీసుకోగా ఇందులో ఆరోజు నుంచి రానున్నట్టుగా టాక్. మరి దీనిపై ఆఫీషియల్ క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ వారు తెలుగులో రిలీజ్ కి తీసుకొచ్చారు.