“డెడ్ పూల్ & వూల్వరైన్” ఫ్రీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యిందా?

ఈ ఏడాది హాలీవుడ్ సినిమా నుంచి భారీ అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చిన పలు చిత్రాల్లో మార్వెల్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చిన అవైటెడ్ సినిమా “డెడ్ పూల్ & వూల్వరైన్” కూడా ఒకటి. మరి మార్వెల్ సినిమాల్లో మంచి క్రేజ్ ఉన్నటువంటి పాత్రలు డెడ్ పూల్, లోగాన్ లపై వచ్చిన ఈ స్పెషల్ సినిమా వరల్డ్ వైడ్ గా భారీ వసూళ్లు సాధించింది. అలాగే మన తెలుగులో కూడా సాలిడ్ వసూళ్లు ఈ సినిమా అందుకొని అదరగొట్టింది.

ఇక ఈ సినిమా ఓటిటి రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా ఈ 1 అక్టోబర్ నుంచి రెంటల్ గా అందుబాటులోకి వచ్చింది. కానీ ఇపుడు ఫైనల్ గా ఫ్రీ స్ట్రీమింగ్ కి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ సినిమా ఈ నవంబర్ 12 నుంచి అందుబాటులో ఉండనున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా కూడా అన్ని మార్వెల్ సినిమాల్లానే డిస్నీ + హాట్ స్టార్ లోనే రానుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

Exit mobile version