ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న “సరిపోదా శనివారం”?

టాలీవుడ్ నుంచి రీసెంట్ గా వచ్చిన సాలిడ్ హిట్ చిత్రాల్లో నాచురల్ స్టార్ నాని హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన మాస్ ఎంటర్టైనర్ చిత్రం “సరిపోదా శనివారం” కూడా ఒకటి. భారీ అంచనాలు నడుమ వచ్చి వాటిని రీచ్ అయ్యి సాలిడ్ ప్రాఫిట్స్ ని కూడా ఈ చిత్రం థియేటర్స్ లో అందించింది. ఇలా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ చిత్రం ఓటిటి రిలీజ్ పై అయితే లేటెస్ట్ బజ్ తెలుస్తుంది.

ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మరి ఇందులో ఈ సినిమా ఈ సెప్టెంబర్ 26 నుంచి పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి ఉండనున్నట్టుగా వినిపిస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సెన్సేషనల్ మ్యూజిక్ ని అందించగా ఎస్ జే సూర్య (SJ Suryah) సాలిడ్ విలన్ రోల్ లో కనిపించారు. అలాగే ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ ని పెట్టారు.

Exit mobile version