Stree 2: “స్త్రీ 2” ఫ్రీ స్ట్రీమింగ్ డేట్ లాక్ అయ్యిందా?


ఇటీవల బాలీవుడ్ సినిమా దగ్గర భారీ హిట్ అయ్యిన చిత్రాల్లో లేడీ ఓరియెంటెడ్ గా వచ్చి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన చిత్రం “స్త్రీ 2” కూడా ఒకటి. మరి స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ మెయిన్ లీడ్ లో రాజ్ కుమార్ రావు అలాగే పంకజ్ త్రిపాఠీ తదితరులు నటించిన ఈ క్రేజీ హారర్ కామెడీ చిత్రాన్ని దర్శకుడు అమర్ కౌశిక్ తెరకెక్కించారు. అయితే ఈ సినిమా థియేటర్స్ లో ఒక బ్లాస్టింగ్ హిట్ అయ్యింది.

అయితే ఈ చిత్రం గత కొన్ని రోజులు కితమే ఓటిటిలో రెంటల్ గా వచ్చిన సంగతి తెలిసిందే. ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఈ చిత్రాన్ని రెంటల్ గా రిలీజ్ కి తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడు నుంచి ఫ్రీ స్ట్రీమింగ్ కి వస్తుంది అనేది బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం స్త్రీ 2 అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే ఏఈ అక్టోబర్ 10 నుంచి వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

Exit mobile version