ఈ దీపావళి కానుకగా టాలీవుడ్ సినిమా దగ్గర రిలీజ్ కి వచ్చిన తెలుగు సిన్మాలు సూపర్ హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో దర్శకుడు వెంకీ అట్లూరి యువ హీరో దుల్కర్ సల్మాన్ తో చేసిన సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “లక్కీ భాస్కర్” కూడా ఒకటి. మరి థియేటర్స్ లో ఆడియెన్స్ ని ఎంతగానో మెప్పించిన ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్స్ లో మంచి వసూళ్లు అందుకుంటుంది.
ఇక ఈ థియేట్రికల్ రన్ తర్వాత సినిమా ఓటిటిలో ఎంటర్ కానున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాన్ని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా డేట్ ని ఫిక్స్ చేసుకున్నట్టుగా ఇపుడు బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ నవంబర్ 30 నుంచి లక్కీ భాస్కర్ నెట్ ఫ్లిక్స్ లో ఎంటర్ కానున్నాడట. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే.