బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ సెన్సేషనల్ హిట్ ఫ్రాంచైజ్ “టైగర్” సిరీస్ కోసం అందరికీ తెలిసిందే. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ వారు చేపట్టిన తమ స్పై యూనివర్స్ లో భాగంగా అయితే ఈ సినిమాని కూడా తాము చేసారు. అయితే ఈ చిత్రం మాత్రం అనుకున్న అంచనాలు రీచ్ కాలేకపోయింది. టాక్ అంత పాజిటివ్ గా రాకపోవడమే ఇందుకు కారణం అని కూడా చెప్పొచ్చు.
ఇక ఇపుడు ఎలానో థియేటర్స్ లో సినిమా రన్ ఎప్పుడో కంప్లీట్ అయ్యిపోయింది. ఇక నెక్స్ట్ ఓటిటి రిలీజ్ ఒక్కటి బాకీ ఉంది. మరి దీనిపై లేటెస్ట్ బజ్ ఒకటి ఇప్పుడు తెలుస్తుంది. దీని ప్రకారం ఈ సినిమా ఈ డిసెంబర్ 31 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా తెలుస్తుంది. హిందీ తెలుగు సహా తమిళ్ భాషల్లో టైగర్ 3 స్ట్రీమింగ్ కి వస్తుంది అని లేటెస్ట్ బజ్. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.