నాచురల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సరిపోదా శనివారం’ నుంచి టెర్రిఫిక్ అప్డేట్ ఎట్టకేలకు వచ్చేసింది. ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. దర్శకుడు వివేక్ ఆత్రేయ అండ్ టీమ్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక నాని ‘దసరా’ తరువాత ఆ రేంజ్లో రెచ్చిపోయి ఈ సినిమాలో నటిస్తున్నట్లుగా ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
పక్కా మాస్ యాక్షన్ కంటెంట్‌తో ఈ సినిమాను మేకర్స్ రూపొందించారు. డైలాగ్ కింగ్ సాయి కుమార్ నాని పాత్రను ఎలివేట్ చేసిన విధానం సూపర్. ఇక క్లాస్‌గా కనిపించే నాని మాస్ అవతారం ఎత్తితే ఎలాంటి రచ్చ జరుగుతుందో మనకు ఈ ట్రైలర్లో చూపెట్టారు. వారం రోజుల కోపాన్ని అనుచుకుని, శనివారం రోజున దాన్ని బయటపెట్టే తీరు అద్భుతంగా తెరకెక్కించారు. ఈ ట్రైలర్లో నాని, ప్రియాంక మోహన్ల ట్రాక్ కూడా ఉంటుందని మనకు క్లూ ఇచ్చారు. ఇక ఎస్.జె.సూర్యతో నాని ఫేస్ టు ఫేస్ సీన్‌కి అభిమానులకు పూనకాలు తెప్పించారు. జేక్స్ బిజాయ్ సంగీతంతో పాటు బీజీఎంతో అభిమానులకు గూస్బంప్స్ తెప్పించాడు.
ఓవరాల్‌గా ‘సరిపోదా శనివారం’ ట్రైలర్ నాని కెరీర్లో బెస్ట్ ట్రైలర్ కట్‌గా నిలిచిందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ ఎందుకు ఇంత ప్రెస్టీజియస్‌గా తీసుకున్నాడో మనకు ఈ ట్రైలర్‌తో ప్రూవ్ చేశాడు. మొత్తానికి నాని ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఖాయమని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ‘సరిపోదా శనివారం’ చిత్రాన్ని ఆగస్టు 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి