టాలీవుడ్లో తెరకెక్కుతున్న క్రేజీ సీక్వెల్ మూవీ ‘ఓదెల-2’ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. గతంలో వచ్చిన ‘ఓదెల’ మూవీ క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ సీక్వెల్ మూవీ ఎలాంటి కథతో తెరకెక్కుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే, ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా నాగసాధు ‘శివశక్తి’ అనే పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాను చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఇక ఈ సినిమా నుండి దీపావళి కానుకగా ఓ టెర్రిఫిక్ పోస్టర్ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో వశిష్ట సింహా ‘తిరుపతి’ అనే పాత్రలో నటిస్తున్నాడు. ఆయనకు సంబంధించిన హార్రర్ లుక్‌ని మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్ చూస్తే ప్రేక్షకులు కొంతమేర భయబ్రాంతులకు గురవుతారని మేకర్స్ ముందుగానే చెప్పారు. వారు చెప్పినట్లుగానే ఈ పోస్టర్ సగం మనిషి ముఖం.. సగం పుర్రెతో హార్రర్గా కనిపిస్తోంది. ఈ సినిమాలో హెబ్బా పటేల్ మరో ముఖ్య పాత్రలో నటిస్తోంది. సంపత్ నంది కథను అందిస్తున్న ఈ సినిమాను అశోక్ తేజ డైరెక్ట్ చేస్తున్నాడు.