“గుడ్ బ్యాడ్ అగ్లీ” సెట్స్ నుంచి అదరగొట్టిన థలా

“గుడ్ బ్యాడ్ అగ్లీ” సెట్స్ నుంచి అదరగొట్టిన థలా

Published on Oct 10, 2024 9:00 AM IST


కోలీవుడ్ సినిమా దగ్గర ఉన్నటువంటి బిగ్గెస్ట్ మాస్ హీరోస్ లో థలా అజిత్ కూడా ఒకరు. మరి అజిత్ ఇప్పుడు రెండు సినిమాల్లో నటిస్తుండగా వాటిలో దర్శకుడు తన అభిమాని అయినటువంటి అధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్న సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “గుడ్ బ్యాడ్ అగ్లీ” కూడా ఒకటి. మరి ఈ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి మంచి అంచనాలు నెలకొనగా ఈ సినిమా కోసం అజిత్ ప్రిపేర్ చేసిన కొత్త లుక్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చింది.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా సెట్స్ నుంచి దర్శకుడు తన అభిమాన హీరోపై పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. అజిత్ వైట్ అండ్ వైట్ సూట్ లో స్టైలిష్ లుక్స్ తో అదరగొట్టారు అని చెప్పాలి. దీనితో ఈ పిక్ ఫ్యాన్స్ లో హిట్ అయ్యింది. మరి ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేస్తుండగా వచ్చే ఏడాది సంక్రాతి కానుకగా మేకర్స్ రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంని టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు