మన దగ్గర షూట్ తో థలా అజిత్.!

Published on Oct 24, 2020 1:16 am IST

కోలీవుడ్ మార్కెట్ లో అపారమైన క్రేజ్ ఉన్న హీరోల్లో హ్యాండ్సమ్ హంక్ థలా అజిత్ ఒకరు. బాక్సాఫీస్ దగ్గర అజిత్ సినిమా పడింది అంటే మన దక్షిణాదిలో సరికొత్త గ్రాసర్ వచ్చినట్టే అని చెప్పాలి. టాక్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ రాబట్టగలిగే ఈ హీరో చివరిగా “విశ్వాసం” అనే డైరెక్ట్ సినిమాతో పలకరించారు. అయితే ఇప్పుడు అజిత్ టాలెంటెడ్ దర్శకుడు హెచ్ వినోత్ దర్శకత్వంలో “వలిమై” అనే భారీ ప్రాజెక్ట్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

గత కొన్నాళ్ల కితమే షూట్ స్టార్టైన ఈ చిత్రం లాక్ డౌన్ వల్ల ఆగాల్సింది. కానీ ఇప్పడు ఉన్నలేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ చిత్రం షూట్ మన దగ్గరే మొదలు కానున్నట్టు తెలుస్తుంది. వచ్చే వారం హైదరాబాద్ లో మొదలు కానున్న షూట్ తో అజిత్ అడుగు పెట్టనున్నట్టుగా ఇప్పుడు సమాచారం. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తుండగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ రిలీజ్ ప్లాన్ చేసే యోచనలో ఉన్నారని గాసిప్స్ కూడా వినిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

More