ప్రముఖ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో ఆయన తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా రూపొందిన చిత్రం ‘తల’. అంకిత నాన్సర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని పి.శ్రీనివాస్ గౌడ్ నిర్మించారు. రోహిత్, ఎస్తేర్ నోరోన్హా, సత్యం రాజేష్, ముక్కు అవినాశ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్ర ట్రైలర్‌ను మంగళవారం లాంచ్ చేశాు. హరో సోహైల్, హీరో అశ్విన్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది.
ఈ కార్యక్రమంలో అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో అంతా అమ్మ రాజశేఖర్ ఫినిష్ అని చెప్పారు. ఇప్పుడు తలతో వచ్చా. నా కొడుకుతో సినిమా చేయాలనేది నా కోరిక. అబ్బాయికి మంచి కథ కావాలి. రియల్ లైఫ్‌లో లవ్ ప్రపోజ్ చేసి నెక్స్ట్ డే పెళ్లి చేసుకున్న కథ కాకుండా ఏం చేయాలని ఆలోచించి మాస్ తీయాలనుకున్నా. ఒక కొత్త పాయింట్ తీసుకున్నా. కొత్తదనం కావాలనుకునే వాడు సినిమా ఆనందంగా చూడవచ్చు. ఈ మూవీ కొని తెలుగు, తమిళ్ గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారంటే గట్స్ కావాలి. శ్రీనివాస్ గౌడ్‌లో దేవుడిని చూస్తున్నా. నా కొడుకు లక్కీ. మా అబ్బాయి సినిమా ఇంత గ్రాండ్ గా వచ్చిందంటే శ్యామ్ కే నాయుడే కారణం. నేనెప్పుడూ ఆయనను మరచిపోను. రోహిత్, ఎస్తర్, అంకిత, సత్యం రాజేశ్ అందరికీ ధన్యవాదాలు. అమ్మ రాజశేఖర్ మూవీలో మదర్ సెంటిమెంట్ సాంగ్ ఇచ్చిన తేజా గారికి థాంక్యూ. నా కూతురు, నా భార్య రాధికి థాంక్యూ. టెక్నిషియన్స్ అందరికీ థాంక్యూ’ అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ధర్మతేజ మాట్లాడుతూ.. ఈ సినిమా చాలా ఎఫర్ట్స్ పెట్టి చేశాం. ఈ సినిమా ట్రైలక్కు మించి ఉంటుంది. ఈ సినిమాని ఫిబ్రవరి 14న మీ ముందుకు తీసుకొస్తున్నందుకు దీపా ఆర్ట్స్ వారికి ధన్యవాదాలు. రాగిన్ రాజ్ చాలా బాగా యాక్ట్ చేశాడు. సినిమా అంతా చాలా నాచురల్ గా ఉంటాడు” అన్నారు.
నటి ఎస్తర్ మాట్లాడుతూ..‘ఈ క్యారెక్టర్ మీరే చేయాలని చెప్పి నాతో నటింపజేశారు. ఈ సినిమా రాగిన కు మంచి డబ్ల్యూ. ఫస్ట్ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. అంకితను కూడా చాలా బాగా చూపించారు. ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించిన సినిమా. ప్రతి ఒక్కరూ సినిమా చూడండి. ప్రొడ్యూసర్ గారికి స్పెషల్ థ్యాంక్స్’ అని అన్నారు.
హీరో అమ్మ రాగిన్ రాజ్ మాట్లాడుతూ..‘మూవీలో అంతా చాలా కష్టపడ్డారు. వారందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను. క్లైమేట్ చేంజెస్ కారణంగా బాగా ఇబ్బంది పడ్డాం. మా అమ్మ, నాన్న ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. శ్రీనివాస్ గౌడ్ గారు ఈ సినిమాను నిర్మించినంచుకు ధన్యవాదాలు. ఫిబ్రవరి 14న తప్పక చూడండి.’ అని అన్నారు.
నటుడు సోహైల్ మాట్లాదుతూ..‘అమ్మ రాజశేఖర్ నాకు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ నుంచి తెలుసు. తరువాత బిగ్ బాస్‌తో కలిశాం. నిజంగానే అమ్మ రాజశేఖర్ పేరుకు తగ్గట్టే అందరికీ వండి పెట్టేవాడు. తినకున్నా అడిగి మరీ పుడ్ వండి పెట్టేవారు. రణం సినిమా తర్వాత ఈ మూవీ కంబ్యాక్‌గా అనిపిస్తోంది. తల టీజర్ చూడగానే అమ్మ రాజశేఖర్ ఈజ్ బ్యాక్ అనిపించింది. రాగిన్ నెక్ట్స్ ధనుష్ అవుతాడు ఇండస్ట్రీకి’ అని అన్నారు.
హీరో అశ్విన్ మాట్లాడుతూ. ‘తల ట్రైలర్ చూశాను. అద్భుతంగా ఉంది. రాగిన్ అదృష్టవంతుడు. నాన్న దర్శకుడు, అమ్మ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. విజువల్స్, కంటెంట్ తక్కువ బడ్జెట్లో అద్భుతంగా చేశారు. ఆర్ఆర్ చాలా బాగుంది. దీపా ఆర్ట్స్ హ్యాండ్ పడితే ఆటోమేటిక్ గా సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కరికీ బిగ్ కంగ్రాట్స్. తల మూవీని ఆదరించండి’ అని అన్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి