తలైవర్ “వేట్టైయన్” ఫస్ట్ సింగిల్ డేట్ వచ్చేసింది.!

తలైవర్ “వేట్టైయన్” ఫస్ట్ సింగిల్ డేట్ వచ్చేసింది.!

Published on Sep 7, 2024 1:01 PM IST

కోలీవుడ్ సూపర్ స్టార్, తలైవర్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు టి జె జ్ఞ్యానావెల్ కాంబినేషన్ లో చేస్తున్న భారీ చిత్రం “వేట్టైయన్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్, రానా దగ్గుబాటి లాంటి స్టార్ తారాగణం నటిస్తుండగా మంచి అంచనాలు అయితే ఈ సినిమాపై నెలకొన్నాయి. ఇక కొన్ని రోజులు కితమే సంగీత దర్శకుడు అనిరుద్ ఫస్ట్ సింగిల్ పై సాలిడ్ జెయింట్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు మేకర్స్ ఈ వినాయక చవితి కానుకగా ఈ అవైటెడ్ అప్డేట్ ని ఇచ్చేసారు.

మరి ఈ సినిమా ఫస్ట్ సింగిల్ గా ‘మనసిలాయో’ అంటూ సాగే సాంగ్ ని ఫస్ట్ సింగిల్ గా ఈ సెప్టెంబర్ 9న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ తలైవర్ పై ఒక మాస్ పోస్టర్ తో రివీల్ చేశారు. మరి లాస్ట్ టైం రజినీకాంత్ కి అనిరుద్ ఎలాంటి మ్యూజిక్ అందించాడో చూసాం. ఈసారి ఈ సినిమాకి ఎలాంటి సంగీతాన్ని అందిస్తాడో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ అక్టోబర్ 10న పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు