ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “లియో” తన కెరీర్ లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. మరి ఈ చిత్రం తర్వాత టాలెంటెడ్ దర్శకుడు వెంకట్ ప్రభుతో తన కెరీర్ 68వ చిత్రాన్ని అనౌన్స్ చేయడంతో దానిపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం తాలూకా టైటిల్ సహా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయగా ఫ్యాన్స్ బాగా థ్రిల్ అయ్యారు.
మెయిన్ గా ఆ టైటిల్ “గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” దీనికి ఆడియెన్స్ ఓ చాలా రీచ్ ఉంది. దీనితో ఇలాంటి టైటిల్ తో విజయ్ రాబోతుండడంతో తమిళ ఆడియెన్స్ థ్రిల్ అయ్యారు. అయితే మన తెలుగు ఆడియెన్స్ లో కూడా టైటిల్ బాగానే రీచ్ అయ్యింది. కానీ సరిగ్గా ఆలోచిస్తే ఈ టైటిల్ మీద ఆల్రెడీ ఓ సినిమా ఉన్నట్టు ఉందే అనే ఆలోచన మొదలైంది.
అప్పుడు స్మాల్ స్క్రీన్ సెన్సేషన్ టర్న్డ్ హీరో సుడిగాలి సుధీర్ మాస్ సినిమా గుర్తొచ్చింది. దర్శకుడు నరేష్ కుప్పిలి తెరకెక్కిస్తున్న చిత్రం కూడా విజయ్ సినిమా జి ఓ ఏ టి(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం) అనే ఎప్పుడో అనౌన్స్ అయ్యి టీజర్ పోస్టర్ లు కూడా వచ్చాయి. మరి ఇదే టైటిల్ తో విజయ్ సినిమా కూడా అనౌన్స్ కావడం గమనార్హం.
అయితే గతంలో “లియో” వెర్షన్ కి రిలీజ్ కి ముందు సేమ్ టైటిల్ మరొకరు దగ్గర ఉంది అని కాస్త హడావుడి జరిగింది. మరి మళ్ళీ ఇదే తరహాలో జరిగింది. ఇక ఈ సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్ విషయంలో ఏమవుతుందో చూడాలి. మొత్తానికి అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలు వైరల్ గా మారాయి.