యువతకి దళపతి విజయ్ ఇచ్చిన సందేశమిదే.!

యువతకి దళపతి విజయ్ ఇచ్చిన సందేశమిదే.!

Published on Jun 28, 2024 2:04 PM IST


సౌత్ స్టార్ హీరోస్ లో ఒకరైన దళపతి విజయ్ జోసెఫ్ ఇపుడు హీరోగా తన కెరీర్ 68వ సినిమాని అయితే టాలెంటెడ్ దర్శకుడు వెంకట్ ప్రభుతో చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తవుతుండగా ఈ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన బర్త్ డే గ్లింప్స్ కి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఈ భారీ చిత్రం మధ్యలో వచ్చిన చిన్న గ్యాప్ లో అయితే దళపతి విజయ్ ఓ మీటింగ్ లో యువతని స్టూడెంట్స్ ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తన వైపు నుంచి సందేశం ఇస్తూ యువత తాత్కాలిక ఆనందాలకు నో చెప్పాలని ముఖ్యంగా డ్రగ్స్ లాంటి వాటికి నో చెప్పాలని పిలుపునిచ్చారు.

ప్రస్తుతం తమిళ నాట మాదకద్రవ్యాల వాడకం ఎక్కువయ్యింది అని దీనిని తగ్గించాలని తన నుంచి సందేశాన్ని అందించాడు. మరి అపారమైన క్రేజ్ విజయ్ సొంతం తన లాంటి వాడి నుంచి ఇలాంటి సందేశం రావడం ఒక మంచి విషయం అని తటస్థులు కూడా ఈ విషయంలో విజయ్ ని అభినందిస్తున్నారు. దీనితో ఇలా విజయ్ లేటెస్ట్ కామెంట్స్ వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు