ఇండియాలో ఎక్కువ టాక్స్ ను పే చేసే సెలబ్రిటీల గురించి ఫార్చ్యూన్ ఇండియా మేగజైన్ ప్రచురించింది. ఈ లిస్ట్ లో బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ 2023-24 సంవత్సరానికి గానూ 92 కోట్ల రూపాయల టాక్స్ పే తో టాప్ లో ఉన్నారు. అడ్వాన్స్ టాక్స్ ను పే చేసే సెలబ్రిటీ ల లిస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
ఈ లిస్ట్ లో టాప్ 3 లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (75 కోట్లు), తర్వాత బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ( 71 కోట్లు)లు అన్నారు. అయితే కోలీవుడ్ స్టార్ హీరో థలపతి విజయ్ 80 కోట్ల రూపాయల టాక్స్ పే తో సల్మాన్, అమితాబ్ బచ్చన్ ల కంటే ముందు స్థానంలో ఉన్నారు. ఇక స్పోర్ట్స్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ 66 కోట్ల రూపాయల టాక్స్ పే చేస్తున్న వ్యక్తిగా టాప్ లో ఉన్నాడు.