కోలీవుడ్ లో ఉన్నటువంటి బిగ్ స్టార్స్ లో స్టార్ హీరో అజిత్ కుమార్ కూడా ఒకరు. మరి అజిత్ హీరోగా తన ఫ్యాన్ దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన అవైటెడ్ సాలిడ్ చిత్రం “గుడ్ బ్యాడ్ అగ్లీ” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా పట్ల అజిత్ కెరీర్లో హైయెస్ట్ అంచనాలు నెలకొల్పుకోగా తెలుగు ఆడియెన్స్ లో కూడా అజిత్ కెరీర్లో అన్ని సినిమాల కంటే ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
దీనితో భారీ డిమాండ్ ఈ చిత్రానికి నెలకొనగా ఇపుడు ఈ సినిమా తెలుగు తమిళ్ సహా కన్నడలో కూడా గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతుంది. మరి కర్ణాటకలో ఈ చిత్రంని ప్రముఖ నిర్మాణ సంస్థ కేవిఎన్ ప్రొడక్షన్స్ వారు రిలీజ్ చేస్తున్నట్టుగా ఇపుడు కన్ఫర్మ్ చేశారు. మరి ఇదే నిర్మాణ సంస్థ కోలీవుడ్ మరో స్టార్ దళపతి విజయ్ తో “జన నాయగన్” చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ నిర్మాతలు అజిత్ సినిమా కోసం నిలబడడం విశేషం. ఇక ఈ భారీ చిత్రం ఏప్రిల్ 10న పాన్ ఇండియా లెవెల్లోపు గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.
#GoodBadUgly is here! ????
Karnataka distribution rights are now with @KvnProductions! Get ready for an action-packed experience! ????????#AjithKumar #AK63 #GoodBadUgly @mythriofficial @Romeopictures_ pic.twitter.com/4dwFVWCatU
— KVN Productions (@KvnProductions) March 19, 2025