థలపతి సాంగ్ కు సెన్సేషనల్ రెస్పాన్స్.!

Published on Nov 22, 2020 4:42 pm IST

ఇళయ థలపతి విజయ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “మాస్టర్” థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ వల్ల ఆగిపోయిన ఈ చిత్రం భారీ అంచనాలను మాత్రం ఇంకా కోల్పోలేదు. అయితే ఇటీవలే విడుదల కాబడిన ఈ చిత్రం తాలూకా టీజర్ కు కూడా ట్రెండ్ సెట్టింగ్ రెస్పాన్స్ వచ్చింది.

వీటితో పాటుగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అందించిన ఆల్బమ్ కూడా అంతే స్థాయి రెస్పాన్స్ ను అందుకుంది. ముఖ్యంగా మాస్ బీట్ “వాతి కమింగ్” సాంగ్ కు అయితే ట్రెమండ్యస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఇదే పాటకు గాను ఏకంగా 90 మిలియన్ వ్యూస్ రావడంతో మేకర్స్ ఈ సాంగ్ ను మరోసారి స్పెషల్ గా మెన్షన్ చేస్తున్నారు.

అలాగే ఇప్పుడు ఈ సాంగ్ ఈ మార్క్ అందుకోవడంతో విజయ్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ కూడా స్టార్ట్ చేసేసారు. లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా నటించగా మాళవికా మోహనన్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుంది అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More