విక్రమ్, సూర్య లని చూసి విజయ్ నేర్చుకోవాలి..

విక్రమ్, సూర్య లని చూసి విజయ్ నేర్చుకోవాలి..

Published on Aug 11, 2024 8:49 PM IST

ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో తమిళ డబ్బింగ్ చిత్రాలకి కానీ అక్కడి హీరోలకి కానీ మన తెలుగు సినిమాలో కూడా మంచి మార్కెట్ ఉంది. అంతే కాకుండా తెలుగులో కొందరు హీరోస్ కి మన దగ్గర కూడా మంచి ఆదరణ అభిమానులు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఆ హీరోస్ లో చాలా మంది మన తెలుగు ఆడియెన్స్ అంటే ఎంతో గౌరవం కూడా అందిస్తారు. ఎక్కడ వరకో ఎందుకు రీసెంట్ గానే లోక నాయకుడు కమల్ హాసన్ తెలుగు ఆడియెన్స్ పట్ల కీలక కామెంట్స్ చేశారు.

ఇలా తమిళ్ నుంచి పలువురు హీరోలు అటు తమ మార్కెట్ ఇటు ఆదరణ కూడా నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్టార్ హీరో సూర్యకి అయితే ఎప్పుడు నుంచో తెలుగు హీరోస్ లో మంచి ఆదరణ ఉంది. ఇంకా తమిళ్ లో హిట్ కాని సినిమాలు మన దగ్గరే మంచి వసూళ్లు కూడా వచ్చినవి ఉన్నాయి. అలా ఎప్పుడు నుంచో సూర్య తన సినిమాలకి తెలుగులో కూడా వచ్చి మరీ ప్రమోషన్స్ చేస్తుంటాడు.

ఇదే విధంగా మరో వెర్సటైల్ హీరో చియాన్ విక్రమ్ కి కూడా తెలుగు ఆడియెన్స్ అంటే ఎంతో ఇష్టమని చెబుతాడు. తన సినిమాలకి తాను కూడా వచ్చి మరీ ప్రీ రిలీజ్ వేడుకలో కూడా పాల్గొని ఇప్పటికీ పలు ఏరియాల్లో తన తాజా చిత్రం “తంగలాన్” ప్రమోషన్స్ ని అగ్రెసివ్ గా చేస్తున్నారు. కానీ మరో హీరో విజయ్ జోసెఫ్ మాత్రం ఇందుకు భిన్నం అని చెప్పాలి. తన సినిమాలు ఎపుడు నుంచో తెలుగులో రిలీజ్ చేస్తున్నప్పటికీ ఇప్పుడే మంచి స్టాండర్డ్ మార్కెట్ వచ్చింది.

కానీ అయినా కూడా ఒక్క సినిమాకి కూడా తెలుగులో ప్రీ రిలీజ్ కి కానీ ప్రమోషన్స్ కి కానీ వచ్చింది లేదు. తెలుగు సినిమాలో మార్కెట్ వసూళ్లు కావాలి కానీ మిగతా హీరోస్ విక్రమ్, సూర్య, కార్తీ, ధనుష్ అంతెందుకు రజినీకాంత్, కమల్ లా తాను మాత్రం తెలుగు ఆడియెన్స్ పట్ల ఎక్కడా తన విధేయత కనబరిచింది లేదు.

ఇది ఒకింత తెలుగు ఆడియెన్స్ పట్ల చిన్న చూపే అనుకోవాలా? మరి ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అంటూ దర్శకుడు వెంకట్ ప్రభుతో ఈ సెప్టెంబర్ 5న వస్తుంది. ఇది కూడా తెలుగు డబ్బింగ్ కి ఉంది. మరి ఈ సినిమా విషయంలో అయినా ఏమన్నా చేస్తాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు