దళపతి విజయ్ స్టార్ పవర్.. ఈ టాక్ తో భారీ వసూళ్లు

దళపతి విజయ్ స్టార్ పవర్.. ఈ టాక్ తో భారీ వసూళ్లు

Published on Sep 6, 2024 12:14 PM IST

ఇళయ దళపతి విజయ్ హీరోగా నటించిన తన అవైటెడ్ లేటెస్ట్ సినిమా “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ డ్రామా చాలా మిక్స్డ్ టాక్ ని సంతరించుకుంది. అయితే ఈ టాక్ తో కూడా భారీ వసూళ్లు ఈ సినిమా నమోదు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇదంతా ఓవర్సీస్ మార్కెట్ లో అట.

విజయ్ సినిమాలకి ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉంది. ఎన్నో దేశాల్లో తన సినిమాలు రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ గ్రాస్ లో ఆ వసూళ్లు కూడా చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఇలా గత చిత్రం “లియో” కి రికార్డు వసూళ్లు నమోదు కాగా ఇప్పుడు ది గోట్ కి కూడా ఓవర్సీస్ మార్కెట్ నుంచి సెన్సేషనల్ స్టార్ట్ నమోదు అయ్యినట్టుగా తెలుస్తుంది.

అనేక దేశాలతో కలిపి డే 1 కి ఈ సినిమా 5 మిలియన్ డాలర్స్ కి పైగా గ్రాస్ ని నమోదు చేసినట్టుగా వినిపిస్తుంది. దీనితో టాక్ తో సంబంధం లేకుండా ప్రీమియర్స్ డే 1 కలిపి దళపతి విజయ్ తన స్టార్ పవర్ ని చూపించాడు అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా ఏజిఎస్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు