పవన్ “ఓజి” పై థమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

పవన్ “ఓజి” పై థమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on Jun 27, 2024 2:00 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్ స్టర్ డ్రామా ఓజి. ఈ చిత్రం ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ చిత్రం పై మరోసారి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పై ఒక అభిమాని చేసిన ఎడిట్ వీడియోకు గానూ థమన్ స్పందించారు. బ్రదర్ మా దగ్గర దీనికంటే చాలా క్రేజీ ఉంది. అది లైఫ్ టైమ్ ఉండిపోతుంది అంటూ చెప్పుకొచ్చారు. ఓజి కోసం ఎదురు చూడండి అని అన్నారు. ఈ పోస్ట్ సినిమా పై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. థమన్ ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ చిత్రాలకు పవర్ ఫుల్ మ్యూజిక్ అందించారు. ఈ ఓజి చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు