చాలా రోజుల తర్వాత కమర్షియల్ ఆల్బమ్ తో ప్రభాస్ వస్తున్నారు – థమన్

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. జూన్ 27 వ తేదీన రిలీజైన కల్కి 2898ఎడి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. వెయ్యి కోట్ల క్లబ్ లో చేరి సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ చిత్రం తర్వాత సలార్ 2, స్పిరిట్, ది రాజా సాబ్, కల్కి2 చిత్రాలు ఉన్నాయి. అయితే ది రాజా సాబ్ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు మ్యూజిక్ డైరెక్టర్ థమన్.

డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది రాజా సాబ్ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఒక సినిమాకి సంబందించిన ఈవెంట్ లో థమన్ మాట్లాడుతూ, ప్రభాస్ గారు చాలా రోజుల తరువాత కమర్షియల్ ఆల్బమ్ తో వస్తున్నారు. మంచి సాంగ్స్, డ్యాన్స్ నంబర్స్ ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు. ఒక విలేఖరి ఫస్ట్ సింగిల్ గురించి అడగగా, ది రాజా సాబ్ గురించి అడగవద్దు అంటూ చెప్పుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. థమన్ చేసిన కామెంట్స్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ లో ఉన్నారు. ఈ చిత్రం నుండి రిలీజైన ఫస్ట్ లుక్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

Exit mobile version