స్పీక‌ర్లు బ్లాస్ట్ చేసేందుకు రెడీ అవుతున్న థ‌మ‌న్

స్పీక‌ర్లు బ్లాస్ట్ చేసేందుకు రెడీ అవుతున్న థ‌మ‌న్

Published on Jun 17, 2024 5:33 PM IST

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, యంగ్ డైరెక్ట‌ర్ సుజీత్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న ‘ఓజి’ మూవీపై ఎలాంటి అంచ‌నాలు నెల‌కొన్నాయో అంద‌రికీ తెలిసిందే. ఈ సినిమాలో ప‌వ‌న్ ఓ గ్యాంగ్ స్ట‌ర్ పాత్ర‌లో న‌టిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే శ‌ర‌వేగంగా జరుగుతుండ‌టంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే ఆస‌క్తి అంద‌రిలో నెల‌కొంది. కాగా, ఈ సినిమాకు థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ ను మేక‌ర్స్ రివీల్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ వ‌ర్క్ లో థ‌మ‌న్ జాయిన్ అయ్యాడ‌ని.. త్వ‌ర‌లోనే ఓ సాలిడ్ బ్లాస్ట్ రానుంద‌ని మేక‌ర్స్ తెలిపారు.

కాగా, థ‌మ‌న్ ప్ర‌స్తుతం ఓ సాంగ్ ను కంపోజ్ చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా నుండి ఓ సాంగ్ ట్రీట్ రానుంద‌ని సినీ వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అభిమానులు కోరే విధంగా ఈ సాంగ్ ఉండ‌నుంద‌ని తెలుస్తోంది. మ‌రి థ‌మ‌న్ ‘ఓజి’ కోసం ఎలాంటి సాంగ్స్ కంపోజ్ చేస్తున్నాడో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ‘ఓజి’ మూవీలో ప్రియాంక ఆరుల్ మోహ‌న్ హీరోయిన్ గా న‌టిస్తోండ‌గా, బాలీవుడ్ న‌టుడు ఇమ్రాన్ హ‌ష్మి విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ప్ర‌కాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను డివివి దాన‌య్య ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు