“ఓజి” బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అవుతుంది.. ఇది కదా కాన్ఫిడెన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న భారీ చిత్రాల్లో దర్శకుడు సుజీత్ తో చేస్తున్న క్రేజీ యాక్షన్ డ్రామా “ఓజి” కూడా ఒకటి. మరి చాలా కాలం తర్వాత పవన్ నుంచి వస్తున్న తన మార్క్ యాక్షన్ సినిమా ఇది కావడంతో అనేక అంచనాలు సెట్టయ్యాయి. ఇక ఈ సినిమా షూటింగ్ కొంచెం బ్యాలన్స్ ఉండగా పవన్ దీనిని త్వరలోనే స్టార్ట్ చేయనున్నారు.

ఇక ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అవుతుంది అని సినిమా సంగీత దర్శకుడు థమన్ ఎస్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఓజి అప్డేట్స్ అతి త్వరలోనే అందిస్తామని ఈ సినిమా కోసం సుజీత్ అదిరే ప్లానింగ్ లు చేస్తున్నాడు. కొంచెం ఓపిక పట్టండి త్వరలోనే అప్డేట్స్ తో కలుద్దాం అని థమన్ గ్యారెంటీ అందించాడు. దీనితో పవన్ ఫ్యాన్స్ థమన్ కాన్ఫిడెన్స్ చూసి మంచి ఎగ్జైటెడ్ గా కనిపిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version