మూవీ లవర్స్ లో మెయిన్ గా అయితే మన సౌత్ ఇండియా సినిమా దగ్గర హీరోస్ ఎలివేషన్స్ కోసం గాని వారిని ఎలివేట్ చేసే బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కానీ ఎప్పుడు ఫ్యాన్స్ మధ్య మంచి హాట్ టాపిక్ లు ఓ రేంజ్ లో ఎప్పటికప్పుడు నడుస్తూ ఉంటాయి. అయితే లేటెస్ట్ గా కూడా మన సౌత్ ఇండియా సినిమా దగ్గర టాప్ ఫామ్ లో ఉన్నటువంటి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లేటెస్ట్ వర్క్ కోసం హాట్ టాపిక్ గా ఇప్పుడు మారింది.
మరి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ తలైవర్ “జైలర్” కి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏ లెవెల్లో వైరల్ అయ్యిందో తెలిసిందే. రజినీకాంత్ జస్ట్ నడిస్తే తన బీజీఎమ్ తో అనిరుద్ మాస్ డ్యూటీ చేశాడు. దీనితో సినిమా రిలీజ్ అయ్యిన నాటి నుంచి నిన్నటి వరకు కూడా జైలర్ బీజీఎమ్ హవా నడవగా ఇక లేటెస్ట్ గా అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని బీజీఎమ్స్ లో తనకంటూ సెపరేట్ మార్క్ ఉన్న థమన్ ఇచ్చిన స్కోర్ కోసం అంతా మాట్లాడుతున్నారు.
నిన్న రిలీజ్ చేసిన “ఓజి” గ్లింప్స్ లో తాను కొట్టిన స్కోర్ విన్నాక ఇన్ని రోజు జైలర్ మ్యూజిక్ ని లేపిన మన వాళ్ళు ఓజి స్కోర్ ముందు అనిరుద్ స్కోర్ తేలిపోయింది అని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. అంతే కాకుండా నార్త్ ఆడియెన్స్ లో కూడా ఓజి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి సాలిడ్ రియాక్షన్స్ యూట్యూబ్ నుంచి వస్తున్నాయి. దీనితో ఇలా ఇప్పుడు థమన్ మాస్ వైరల్ గా మారింది. ఇక ఫుల్ సినిమాకి అయితే ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి.


