Game Changer: ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్.. క్లారిటీ వచ్చేసిందిగా!

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్.. క్లారిటీ వచ్చేసిందిగా!

Published on Sep 18, 2024 9:04 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’(Game Changer) ఇప్పటికే షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తుండగా, ఇప్పటివరకు కేవలం ఫస్ట్ సింగిల్ సాంగ్ మాత్రమే ఈ సినిమా నుండి రిలీజ్ అయ్యింది. దీంతో అభిమానులు ఈ సినిమా నుంచి నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న థమన్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమాకు సంబంధించిన నెక్స్ట్ సాంగ్ అప్డేట్స్ వచ్చే వారం నుంచి వస్తాయని ఆయన తెలిపారు. అంతేగాక, ఈ సినిమా బీజీఎం స్కోర్ పనులు అక్టోబర్ 1 నుంచి స్టార్ట్ అవుతాయని.. డిసెంబర్ 20న థియేటర్లలో రీసౌండ్ రావాల్సిందే అని ఆయన కన్ఫమ్ చేశారు.

దీంతో ‘గేమ్ ఛేంజర్’ ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. డిసెంబర్ 20న ఈ సినిమా రావడం ఖాయమని.. ఇక ఈ సినిమా నెక్స్ట్ అప్డేట్స్ కూడా రెడీ చేస్తున్నారని తేలిపోయింది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా ఎస్.జె.సూర్య, అంజలి, శ్రీకాంత్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు