“గేమ్ ఛేంజర్” నెక్స్ట్ సాంగ్ ఈ ట్యూన్.. గ్లోబల్ లెవెల్లో అంటున్న థమన్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్ గా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం తెలిసిందే. అయితే ఈ చిత్రం అటు శంకర్ అలాగే చరణ్ కెరీర్ లో కూడా 15వ సినిమాగా వస్తుంది. దీనితో స్పెషల్ అంచనాలు నెలకొనగా ఇపుడు ఒకో అప్డేట్ తో ఆడియెన్స్ లో మరింత ఎగ్జైట్మెంట్ ఏర్పడుతుంది.

మరి ఇప్పుడు వరకు రెండు సాంగ్స్ సినిమా నుంచి వచ్చిన సంగతి తెలిసిందే. జరగండి అంటూ మంచి మాస్ డ్యూయెట్ ని తర్వాత సోలోగా హీరోపై మాస్ సాంగ్ ని విడుదల చేసిన మేకర్స్ నెక్స్ట్ సాంగ్ ని ఈ అక్టోబర్ లోనే రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు. అయితే ఇప్పుడు ఈ మూడో సాంగ్ పై సంగీత దర్శకుడు థమన్ ఇంట్రెస్టింగ్ క్లారిటీ అయితే ఇచ్చేసాడు.

ఈసారి గేమ్ ఛేంజర్ నుంచి మంచి మంచి కదిలించే మెలోడీ సాంగ్ వస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఈ సాంగ్ నవంబర్ లో వస్తున్నట్టుగా హింట్ ఇచ్చాడు. ఇంకా ఈ సాంగ్ గ్లోబ్ వైబ్ చేస్తుంది అన్నట్టు అంటున్నాడు. మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Exit mobile version