Game Changer: జరగండి లీక్ వెర్షన్ పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన థమన్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో చేస్తున్న అవైటెడ్ సినిమానే “గేమ్ ఛేంజర్”. మెగా ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సాలిడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాతో శంకర్ మళ్ళీ తన మార్క్ హిట్ కొట్టాలని తన ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఇప్పుడు వరకు ఒక్క పాట మాత్రమే వచ్చింది.

అదే చరణ్, అంజలి నడుమ డ్యూయెట్ సాంగ్ జరగండి అనే సాంగ్ ని రిలీజ్ చేశారు. అయితే ఈ సాంగ్ అఫీషియల్ గా రిలీజ్ చేయకముందు మరో వెర్షన్ మరో గాత్రదారుల వాయిస్ తో వచ్చాయి. ఆ సాంగ్ అందరికీ బాగా ఎక్కేసింది. కానీ తర్వాత సాంగ్ లో మరో వాయిస్ ఉండడంతో కొంచెం డిజప్పాయింట్ అయ్యారు.

మరి ఈ సాంగ్ పై థమన్ సాలిడ్ అప్డేట్ అయితే అందించాడు. ఎడిటింగ్ రూమ్ నుంచి జరగండి సాంగ్ విజువల్స్ చూసాను అని సౌండ్, విజువల్స్ అదిరిపోయాయి. అలాగే ఫ్యాన్స్ కోరుకుంటున్నట్టుగా అప్పుడు లీక్ అయ్యిన సాంగ్ లో వోకల్స్ ని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని మరో ఊహించని అప్డేట్ ని అందించాడు. మరి నిజంగా ఈ ఛేంజ్ ని గేమ్ ఛేంజర్ కోసం చేస్తాడా లేదా అనేది చూడాలి.

Exit mobile version