“వీర సింహా రెడ్డి” పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన థమన్.!

Published on Dec 4, 2022 8:00 am IST

లేటెస్ట్ గానే నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం “వీర సింహా రెడ్డి” రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో అంచనాలు ఒక్కసారిగా పీక్స్ కి వెళ్లాయి. ఇక ఈ అవైటెడ్ మాస్ డ్రామా ఓ పక్క శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటూ ఉండగా మరో పక్క టెక్నికల్ పనులు కూడా శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. మరి ఇందులో భాగంగా ఈ సినిమా సంగీత దర్శకుడు థమన్ సాలిడ్ అప్డేట్ ని అందించాడు.

“ఈ సినిమాకి పాటలు అన్నీ కంప్లీట్ అయ్యిపోయాయి అని ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ స్టార్ట్ చేస్తున్నామని జై బాలయ్య” అంటూ పోస్ట్ పెట్టాడు. అలాగే తన మ్యూజిక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని మరియు సాహిత్య రచయిత రామజోగయ్య శాస్త్రి లతో కలిసి ఫొటోతో షేర్ చేసుకున్నాడు. మరి లాస్ట్ టైం అఖండ కి తాను ఇచ్చిన స్కోర్ ఎవరు మర్చిపోలేరు.. ఇక ఈసారి ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :