ఇది నా హంబుల్ రిక్వెస్ట్ – థమన్

ఇది నా హంబుల్ రిక్వెస్ట్ – థమన్

Published on Sep 6, 2024 7:06 PM IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గేమ్ ఛేంజర్ ఈ డిసెంబర్ నెలలో రిలీజ్ కానుంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిచగా, మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం నుండి గత కొద్ది నెలలుగా ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తూ, నెగెటివ్ ట్రెండ్ ను ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే నేడు థమన్ మరోసారి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ను షేర్ చేశారు. అంతా బాగుంది బ్రదర్స్. ఒక సినిమా టెక్నీషియన్ గా మీరు అప్డేట్స్ కోసం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నారు అని అర్థం చేసుకున్నాం. మాకు ఎల్లప్పుడూ మీ ప్రోత్సాహం, ప్రేమ అవసరం. ఏ సినిమాకైనా మీరే ముందు అన్ని అయి అంటారు. మిమ్మల్ని 100 శాతం గౌరవిస్తాం, ఎలాంటి పరిస్థితి అయినా. ఇలాంటి దిగజారుడు, తొందరపాటు వ్యాఖ్యలు ప్రోత్సహించడం సరైంది కాదు. ఇవి సినిమాల గొప్పతనాన్ని దెబ్బతీస్థాయి. ఇలాంటి అసభ్యకరమైన, దిగజారుడు భాషను ఉపయోగించవద్దు. ఇది నా హంబుల్ రిక్వెస్ట్ అని పేర్కొన్నారు. థమన్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు