మ్యూజికల్ బ్లాస్ట్ కి సిద్ధమైన థమన్!


టాలీవుడ్ లో వరుస భారీ చిత్రాలకి మ్యూజిక్ అందిస్తున్న థమన్ మరొక క్రేజీ పోస్ట్ ను షేర్ చేశాడు. థమన్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్, NBK109, ఓజి, ది రాజా సాబ్ లాంటి భారీ చిత్రాలకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. బాలీవుడ్ కి బేబీ జాన్ అనే చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నాడు.

అయితే త్వరలో ఈ చిత్రాల నుండి మ్యూజికల్ అప్డేట్స్ వెలువడే అవకాశం ఉంది. గేమ్ ఛేంజర్ సెకండ్ సింగిల్ అయితే ఈ నెల కన్ఫర్మ్ గా రిలీజ్ కావాల్సి ఉంది. ఇక NBK109, ది రాజా సాబ్, ఓజి ఫస్ట్ సింగిల్ అప్డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బాలీవుడ్ లో కూడా చేస్తున్న బేబీ జాన్ మూవీ కి సంబందించి మ్యూజిక్ అప్డేట్ రానుంది. ఈ వచ్చే మూడు నెలలు సాలిడ్ అప్డేట్స్ రానున్నట్లు థమన్ మరొక పోస్ట్ లో పరోక్షంగా వెల్లడించాడు. ఈ పోస్ట్ తో ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం ఉరకలేస్తుంది. ఈ అప్డేట్స్ కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Exit mobile version