తమన్ క్రేజీ ప్రాజెక్ట్ పట్టేశాడు

Published on Oct 17, 2020 12:11 am IST


సంగీత దర్శకుడు తమన్ మామూలు ఫామ్లో లేడు. ‘అల వైకుంఠపురం’ విజయంతో టాప్ సంగీత దర్శకుడిగా నిలబడ్డారు. అందుకే తెలుగు, తమిళంలో ఆయనకు డిమాండ్ బాగా పెరిగింది. ఇటీవలే తమిళంలో లాంఛ్ అయిన క్రేజీ ప్రాజెక్ట్ ఒకటి ఆయన వద్దకే వెళ్లింది. ‘వాడు వీడు’ క్రేజీ కాంబో ఆర్య, విశాల్ కలిసి కొత్త సినిమా చేయనున్నారు. ఈ సినిమాకు దర్శక నిర్మాతలు సంగీత దర్శకుదిగా తమన్ ను ఎంచుకున్నారు. తమన్ లాంటి ట్రెండీ కంపోజర్ చేరిక ఈ సినిమాకు మరింత బలాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు.

సినిమా రా అండ్ రస్టిక్ తరహాలో ఉంటుంది కాబట్టి తమన్ మాస్ బీట్స్ చిత్రానికి బాగా వర్కవుట్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం తమన్ చేతిలో ‘వకీల్ సాబ్, సోలో బ్రతుకే సో బెటరు, క్రాక్, టక్ జగదీష్, మిస్ ఇండియా’ లాంటి సినిమాలున్నాయి. ‘అరిమ నంబి, ఇరుముగన్, నోటా’ సినిమాల దర్శకుడు ఆనంద్ శంకర్ ఈ మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించనున్నారు. నిర్మాత వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం :

More