“అఖండ” బ్లాస్ట్ ని లాస్ట్ లో ప్లాన్ చేసిన థమన్..


నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన రీసెంట్ భారీ హిట్ చిత్రం “అఖండ” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇన్నేళ్లు అయినప్పటికీ అభిమానులు ఎప్పుడు నుంచో కోరుకుంటున్న ఓ ఎస్ టి( ఒరిజినల్ సౌండ్ ట్రాక్) ని మాత్రం సంగీతం దర్శకుడు థమన్ ఒక అందని ద్రాక్ష పండులానే పెట్టాడు.

అప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక అఖండ స్కోర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. బోయపాటి టేకింగ్ ని పదింతలు ఎక్కువ హైప్ ఇస్తూ థమన్ తన మ్యూజిక్ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలా సినిమాలో మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని ఓ రేంజ్ లో అందించాడు.

దీనితో అప్పుడు నుంచి కూడా మ్యూజిక్ లవర్స్ అఖండ ఓ ఎస్ టి కోసం ఎదురు చూస్తుండగా ఫైనల్ గా నిన్న థమన్ అప్డేట్ అందించాడు. అఖండ పై ఉన్న క్రేజ్ ని పసిగట్టిన థమన్ ఒక లిస్ట్ ఇచ్చి అన్నిటి కంటే లాస్ట్ లో అఖండ ని రిలీజ్ చేయనున్నట్టుగా కన్ఫర్మ్ చేసాడు. మొత్తానికి అయితే ఇలా థమన్ అఖండ బ్లాస్ట్ ని ప్లాన్ చేసాడని చెప్పాలి.

Exit mobile version