‘గేమ్ ఛేంజ‌ర్’లో సాంగ్ పై థ‌మ‌న్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

‘గేమ్ ఛేంజ‌ర్’లో సాంగ్ పై థ‌మ‌న్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

Published on Jul 25, 2024 3:37 PM IST

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘గేమ్ ఛేంజ‌ర్’ చివ‌రిద‌శ షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమాను క్రిస్మ‌స్ కానుక‌గా రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ రెడీ అవుతున్నారు. కాగా, ఈ సినిమాతో రామ్ చ‌ర‌ణ్ మ‌రోసారి బాక్సాఫీస్ రికార్డులు తిర‌గ‌రాయ‌డం ఖాయ‌మ‌ని చిత్ర యూనిట్ ధీమా వ్య‌క్తం చేస్తోంది.

రెండు విభిన్న‌మైన పాత్ర‌ల్లో చ‌ర‌ణ్ ఈ సినిమాలో న‌టిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు థ‌మ‌న్ సంగీతం అందిస్తుండ‌గా ఇప్ప‌టికే ”జ‌ర‌గండి.. జ‌ర‌గండి..” అనే పాట‌ను రిలీజ్ చేశారు మేక‌ర్స్. అయితే, ఈ సినిమాలోని ఓ సాంగ్ పై థ‌మ‌న్ ట్విట్ట‌ర్ లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ కి రియాక్ట్ అయ్యారు. పాట‌ల ర‌చ‌యిత కాస‌ర్ల శ్యామ్ ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ‘గేమ్ ఛేంజ‌ర్’ మూవీలో ”నెల్లూరి నెర‌జాన” త‌ర‌హా పాట ఉంటుంద‌ని.. ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చ‌ర‌ణ్‌, అంజ‌లిపై ఈ పాట చిత్రీక‌ర‌ణ ఉంటుంద‌ని తెలిపారు. దీనికి థ‌మ‌న్ ఈ పాట త‌న‌కు ఎంతో ఇష్ట‌మైంద‌ని ల‌వ్ ఇమోజీతో రియాక్ట్ అయ్యాడు.

దీంతో ఇప్పుడు ‘గేమ్ ఛేంజ‌ర్’ ఫ్లాష్ బ్యాక్ లో వ‌చ్చే ఈ పాట ఎలా ఉండ‌బోతుందా అనే ఆస‌క్తి అభిమానుల్లో నెల‌కొంది. ఇక ఈ సినిమాను ద‌ర్శకుడు శంక‌ర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తుండ‌గా, దిల్ రాజు ఈ సినిమాను భారీ బ‌డ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు