గేమ్ ఛేంజర్: నెగెటివ్ ట్రెండ్ పై థమన్ పోస్ట్


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గేమ్ ఛేంజర్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని డిసెంబర్ నెలలో రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే రిలీజ్ డేట్ పై అప్డేట్ ఈ వినాయక చవితికి వచ్చే అవకాశం ఉందని అంతా భావించారు. ఆగస్ట్ చివరిలో అప్డేట్ ఇస్తానని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ హామీ ఇచ్చాడు, కానీ అది కూడా జరగలేదు.

ఇంకా ఎలాంటి అప్డేట్ పై మేకర్స్ క్లారిటీ ఇవ్వక పోవడంతో ఫ్యాన్స్ నెగెటివ్ ట్రెండ్ ను ప్రారంభించారు. ఈ ట్రెండ్ పట్ల థమన్ రెస్పాండ్ అయ్యారు. గత కొన్నేళ్లుగా చిత్ర యూనిట్ చేస్తున్న కృషిని హైలైట్ చేస్తూ సుదీర్ఘమైన ట్వీట్‌ను పోస్ట్ చేశాడు. నెగెటివ్ ట్రెండ్స్ లేదా అసభ్యకరమైన వ్యాఖ్యలను వ్యాప్తి చేయడం వల్ల ఉపయోగం ఏమిటి. ఇది సినిమాను, దాని గొప్పతనాన్ని దెబ్బతీస్తుంది. మా సాంకేతిక బృందం అంతా గత 2 సంవత్సరాల నుండి కంటెంట్‌ను కలిగి ఉన్నారు మరియు భద్రపరుస్తున్నారు. దానిని మీ అందరికి గొప్ప పద్ధతిలో తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. అభిమానులందరూ దయతో మాకు కొంత సానుకూల శక్తిని అందించాలని హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను. నెగెటివ్ ట్రెండ్ చేయడం లాంటివి సినిమా ప్రతిష్టను దెబ్బతీస్తాయని థమన్ పేర్కొన్నాడు. ఈ నెలలో తప్పకుండా అప్డేట్ వస్తుందని చరణ్ అభిమానులకు హామీ ఇచ్చాడు. కైరా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్‌.జే. సూర్య ప్రతినాయకుడిగా నటించాడు.

Exit mobile version