గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రాబోతున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ ‘గేమ్ ఛేంజర్’. జనవరి 10, 2025న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ పొలిటికల్ డ్రామా పై మెగా ఫ్యాన్స్ కి ఇప్పటికే విపరీతమైన అంచనాలు ఉన్నాయి. కాగా ఆ ఉత్సాహాన్ని పెంచుతూ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమా ఫైనల్ కట్ చూసిన తర్వాత తన ‘ఎక్స్’లో ఓ పోస్ట్ పెట్టారు. ఈ చిత్రాన్ని “సూపర్ మాసివ్”గా అభివర్ణిస్తూ… “జరగండి” పాటను హైలైట్ అంటూ తమన్ చెప్పుకొచ్చాడు.
థియేటర్స్ లో ఈ జరగండి పాట అదిరిపోతోంది అన్నట్టు తమన్ క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రామ్ నందన్ అనే యువ ఐఏఎస్ అధికారిగా కనిపించడంతో పాటు, తండ్రి అప్పన్న పాత్రనూ ఆయనే చేశారు. అంజలి, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీకి తమన్ సంగీతం అందించారు.
Just Saw The
SUPER MASSIVE Final Cut #JARAGANDIWORTH MAMA WORTH ????????????????????????????????
— thaman S (@MusicThaman) December 28, 2024