‘డాకు మహారాజ్’ స్కోర్‌తో స్పీకర్స్ బ్లాస్ చేయనున్న థమన్

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా చూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు బాబీ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఇక ఈ సినిమాలో బాలయ్య పాత్ర ఆడియెన్స్‌ను కట్టిపడేయనుంది.

ఈ సినిమాకు థమన్ సంగీతం మేజర్ అసెట్‌గా మారనుందని చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో చెబుతూ వస్తోంది. అయితే, బాలయ్య సినిమాలకు థమన్ ఇచ్చే మ్యూజిక్ వేరే లెవెల్‌లో ఉంటుందని చెప్పాలి. ఇప్పుడు ‘డాకు మహారాజ్’ మూవీకి కూడా థమన్ నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ అందించనున్నాడు. ఆయన ఇచ్చిన స్కోర్‌కు స్పీకర్లు బ్లాస్ కావడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది.

గతంలో అఖండ చిత్రానికి థమన్ ఇచ్చిన మ్యూజిక్ ఎఫెక్ట్ ఎలాంటిదో మనం చూశాం. మరి ఈసారి బాలయ్య కోసం థమన్ ఎలాంటి స్కోర్ ఇచ్చాడో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

Exit mobile version