“డాకు” మాస్ స్కోర్.. సోషల్ మీడియాని రూల్ చేస్తున్న థమన్

లేటెస్ట్ గా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్ కి వచ్చిన సూపర్ హిట్ సంక్రాంతి చిత్రాల్లో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన సాలిడ్ హిట్ చిత్రం “డాకు మహారాజ్” కూడా ఒకటి. అయితే ఈ చిత్రంకి సంగీత దర్శకుడు థమన్ ఇచ్చిన వర్క్ కి స్పెషల్ అప్లాజ్ కూడా వచ్చింది. మామూలుగా బాలయ్య సినిమాలకి థమన్ ఓ రేంజ్ లో సంగీతం ఇస్తాడని అందరికీ తెలిసిందే.

అయితే ఇపుడు ఉన్న ట్రెండ్ లో సోషల్ మీడియాలో కొన్ని పర్టిక్యులర్ మ్యూజిక్ బీట్స్ కి భాషా భేదం లేకుండా పలు ఎడిట్స్ పడుతూ ఉంటాయి. అయితే ఇలాంటివి ఇతర స్టార్ హీరోస్ లేదా క్రికెటర్స్ పై కూడా మనవాళ్ళు చేసుకుంటారు. మరి ఎక్కువగా అనిరుద్ ఇచ్చిన పలు సినిమాలకి స్కోర్ లతో అలాంటి ఎడిట్స్ కనిపించేవి కానీ ఇపుడు ఫర్ ఏ ఛేంజ్ థమన్ సోషల్ మీడియాని రూల్ చేస్తున్నాడని చెప్పాలి.

డాకు మహారాజ్ లో బాలయ్యకి ఇచ్చిన ఒక మాస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ‘సైతాన్’ బిట్ ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. ఇలా ప్రస్తుతం మాత్రం తెలుగు సహా తమిళ్, హిందీ నెటిజన్స్ లో కూడా ఈ బిట్ మాత్రం ఓ రేంజ్ లో అదరగొడుతుంది అని చెప్పాల్సిందే. ఇక ఈ చిత్రంలో బాబీ డియోల్ విలన్ గా నటించగా నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మాణం వహించారు.

Exit mobile version