ఇంట్రెస్టింగ్..అప్పుడు “సలార్” ఇప్పుడు “కంగువ”.!

ఇంట్రెస్టింగ్..అప్పుడు “సలార్” ఇప్పుడు “కంగువ”.!

Published on Apr 16, 2023 11:01 AM IST

Kanguva Salaar

ప్రస్తుతం పాన్ ఇండియన్ మార్కెట్ లో సెన్సేషనల్ హైప్ తో ఉన్నటువంటి అనేక చిత్రాల్లో మన దక్షిణాది సినిమా నుంచి రానున్న సినిమాలే అధికంగా ఉన్నాయని చెప్పాలి. అయితే వాటిలో చాలా చిత్రాల్లో కాస్త డిఫరెంట్ గా అనిపించిన టైటిల్స్ తో ఆసక్తి రేపిన సినిమాలు కూడా ఉన్నాయి. మరి అలా గత కొన్నాళ్ల కితం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో అనౌన్స్ చేసిన “సలార్” తో మొదలైంది.

అప్పట్లో ఈ టైటిల్ అనౌన్స్ చేయగానే కాస్త డిఫరెంట్ గా మాసివ్ గా అనిపించింది. దీనితో అసలు ఆ టైటిల్ వెనుక ఉన్న అర్ధం ఏంటి? దేనిని అది సూచిస్తుంది అనేది అంతా బాగా వెతికారు. ఇక ఇప్పుడు మళ్ళీ స్టార్ హీరో సూర్య శివ దర్శకత్వంలో నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా విషయంలో కూడా అందరిలో ఆసక్తి నెలకొంది.

మరి ఈ సినిమాకి “కంగువ” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని అనౌన్స్ చేయడం ఇది కూడా కాస్త డిఫరెంట్ గా అందరికీ అనిపించింది. దీనితో దీని వెనుక అర్ధం ఏమిటి అనేది కూడా ఇపుడు అంతా స్టార్ట్ చేశారు. అయితే దీని వెనుక ఉన్న అర్ధం “మ్యాన్ విత్ పవర్ ఆఫ్ ఫైర్”(అగ్ని లాంటి శక్తి కలిగిన మనిషి) అంటూ ట్యాగ్ వైరల్ అవుతుంది. దీనితో అప్పుడు సలార్ ఇప్పుడు కంగువ టైటిల్స్ మంచి వైరల్ గా మారాయి.

తాజా వార్తలు