మన తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి టాప్ స్టార్స్ లో భారీ ఫాలోయింగ్ ఉన్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబులు కోసం తెలిసిందే. అయితే ఈ ఇద్దరి నడుమ బాక్సాఫీస్ వార్ ఎప్పుడు నుంచో ఎపిక్ లెవెల్లో కొనసాగుతుంది. అయితే ఇపుడు పవన్ సినిమాల కంటే రాజకీయాల్లో ఎక్కువ బిజీగా ఉండగా మహేష్ బాబు దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి సినిమాతో సిద్ధం అవుతున్నాడు.
మరి ఈ ఇద్దరు టాప్ స్టార్స్ పై ఒక క్రేజీ అంశం ఫ్యాన్స్ లో కనెక్ట్ అయ్యిందని చెప్పాలి. గత కొన్ని వారాల కితం పవన్ కళ్యాణ్ పేల్చినా “సీజ్ ది షిప్” మాట ఎంతలా సోషల్ మీడియాని షేక్ చేసిందో అందరికీ తెలిసిందే. మరి దీని తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో సీజ్ ది పాస్ పోర్ట్ అనే మాట ఇపుడు వైరల్ గా మారింది. మహేష్ పాస్ పోర్ట్ జక్కన్న తీసేసుకొని ఇక ఎలాంటి వెకేషన్స్ లేవు అంటూ చేసిన ఫన్ పోస్ట్ తో బోలెడు మీమ్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి.
మరి వీటిలో ట్రెండింగ్ గా సీజ్ ది పాస్ పోర్ట్ అనే మాట మరింత స్పెషల్ గా మారింది. ఇలా అప్పుడు సీజ్ ది షిప్ ఇపుడు సీజ్ ది పాస్ పోర్ట్ అనే లైన్స్ మన టాప్ స్టార్స్ విషయంలో స్పెషల్ అటెన్షన్ ని తెచ్చుకున్నాయి.